సదాయి బనోవన్ అంటే మహిళల స్వరం ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు నిర్వహించే ఏకైక రేడియో స్టేషన్.
దీనిని అధికారులు ఇటీవల మూసివేశారు. రంజాన్ మాసంలో రేడియోలో పాటలు ప్లే చేస్తున్నామని కారణం చెప్పారు.
ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నిబంధనలకు విరుద్ధమైన రంజాన్లో సంగీతాన్ని ప్లే చేయడం కోసం రేడియోను మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నప్పటికీ, రేడియో హెడ్ నజియా సోరోష్ మాత్రం అందుకు భిన్నంగా పేర్కొన్నారు.
రంజాన్ మాసంలో తాము ఎలాంటి సంగీతాన్ని ప్లే చేయలేదని సదాయి బనోవన్ అధినేత నజియా సోరోష్ పేర్కొన్నారు. మహిళలు నిర్వహించే ఏకైక రేడియో స్టేషన్ను ఆపడానికి ఇది తాలిబాన్ల పన్నాగమని కూడా ఆమె పేర్కొంది.
© Vygr Media Private Limited 2022. All Rights Reserved.












